బుధవారం 27 మే 2020
National - May 11, 2020 , 18:42:50

ఆన్ లైన్ లో అరుదైన పుస్తకాలు

ఆన్ లైన్ లో అరుదైన పుస్తకాలు

కోల్ కతా: దేశం త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే  మరిన్ని పరిశోధనలు జరగాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అనేక సందర్భాల్లో  ఉద్ఘాటించారు. పరిశోధనలే ప్రగతికి మూలం. దేశంలోని యూనివర్శిటీ లు అధ్బుతమైన పరిశోధనలకు వేదికలుగా మారాలి. అది జరగాలంటే సమస్త సమాచారం అందించే  అరుదైన పుస్తక సంపద కావాలి. కోల్ కతా యూనివర్సిటీ ఇదే విషయాన్ని గమనించి 19వ శతాబ్దంలోని అరుదైన పుస్తకాలు, అరుదైన పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ లో ఉంచింది. లాక్ డౌన్ సమయంలో  తమ విద్యార్థులకే కాకుండా ప్రజలందరికీ  వందేండ్ల నాటి రికార్డులను కోల్ కతా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. లాక్ డౌన్ నేపథ్యంలో పరిశోధకులకు  అరుదైన రీసెర్చ్ కు సంబంధించిన సమాచారం అవసరమవుతుంది.

అటువంటి సమాచారం కోసం వెతుక్కోకుండా ఉండేందుకు తాము వందేండ్ల నాటి పుస్తకాలు, పరిశోధనలు, పలురకాల పిహెచ్ డి థీసిస్  తోపాటు ఇతర సమాచారాన్ని ఆన్ లైన్ లో పొందు పరిచామని కోల్ కతా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ సోనాలి చక్రవర్తి బందోపాధ్యాయ్ తెలిపారు.  అరుదైన సమాచారాన్ని డిజిటలైజ్ చేయడమే కాకుండా ప్రొఫెసర్లు విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నారు. పరిశోధకులకు ఈ లాక్ డౌన్ సమయంలో పుస్తకాలు అందుబాటులో లేక వారు చేసే రీసెర్చ్ కు ఆటంకం కలుగుతున్నది. అటువంటి వారికోసం ఆన్ లైన్ లో అరుదైన పరిశోధన లకు సంబంధించిన రికార్డులను ఉంచామని ఆమె చెప్పారు. అంతేకాదు పరిశోధనల ఆవశ్యకతను సమాజంలో ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అందుకోసమే అందరికి వీటిని అందుబాటులో కి తీసుకు వచ్చామని"ఆమె అంటున్నారు. 1861-2018 వరకు ఉన్నపట్టభద్రుల వివరాలు, 1870-1986 మధ్య కాలంలో రాసిన   ప్రసంగాలు, యూనివర్సిటీ కమిషన్ అందించిన నివేదికలు, క్వశ్చన్ పేపర్లు , అరుదైన పరిశోధనలు ,పరిశోధకుకులు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు.


logo