శుక్రవారం 05 జూన్ 2020
National - May 11, 2020 , 18:17:49

టికెట్లు రద్దు చేసుకున్న భక్తులకు తిరిగి డబ్బు చెల్లించనున్న టీటీడీ

టికెట్లు రద్దు చేసుకున్న భక్తులకు తిరిగి డబ్బు చెల్లించనున్న టీటీడీతిరుమల: లాక్‌డౌన్ నేపథ్యంలో  మార్చి 14 నుంచి  మే 31వ తేదీ వ‌ర‌కు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి ) శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు ర‌ద్దు చేసుకున్న భ‌క్తుల‌కు    తిరిగి డబ్బు చెల్లించాలని నిర్ణయించింది. త్వ‌రిత‌గ‌తిన  భ‌క్తుల‌కు ఆయా నగదును రీఫండ్ చేయాల‌ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోమ‌వారం మొద‌టిసారిగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఐటి విభాగం కార్య‌క‌లాపాలపై ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్ల‌ను ర‌ద్దు చేసుకున్న వారిలో ఇప్ప‌టివ‌ర‌కు 45 శాతం మంది భ‌క్తులు రీఫండ్ కోసం వివ‌రాలు స‌మ‌ర్పించార‌ని తెలిపారు. మొత్తం 2,50,503 మంది రీఫండ్ కోసం కోర‌గా 90 శాతం అనగా 1,93,588 మందికి వారి ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశామ‌ని వివ‌రించారు. మిగిలిన‌వారికి కూడా త్వ‌ర‌లోనే చెల్లిస్తామ‌ని ఆయన స్పష్టం చేశారు. 


logo