బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 18:02:49

ఆంధ్రాలో జులై లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్

ఆంధ్రాలో జులై లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల పై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌  క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు జూలైలో నిర్వహించనున్నట్లు అయన స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ ,మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు. తరగతి గదిలో 12 మంది విద్యార్థులతో మాత్రమే పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.  


logo