గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 17:28:45

'స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్' ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌

'స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్'  ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌

హైదరాబాద్ : అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, స్మార్ట్ మ‌ల్టీఫ్లెక్స్, ఆహా, హైఫ్లిక్స్, జీ ఫైవ్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వీక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రేక్షకులకు కొత్త సినిమాలతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో థియేట‌ర్లు మూతపడడంతో ఎక్కువమంది ఓటిటి వేదికల వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్' వినియోగదారులకు ఉచిత రిజిస్ట్రేష‌న్‌తో పాటు స‌బ్‌స్క్రిప్ష‌న్ అందిస్తున్నది. " స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్ డాట్ కామ్"  వెబ్సైట్ లో  సినిమాలతో పాటు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు, స్మార్ట్ ఫిల్మ్ లు అందుబాటులో ఉన్నాయి. 'స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్'లో ఎటువంటి షరతులు లేకుండా 6 నెల‌ల పాటు ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్ ను అందిస్తున్నారు.  


logo