బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 13:54:06

రూ.6.5 మిలియన్ల తో డీబీఎస్ సేవాకార్యక్రమాలు

రూ.6.5 మిలియన్ల తో డీబీఎస్ సేవాకార్యక్రమాలు

హైదరాబాద్: ప్రముఖ ఫైనాన్స్ సంస్థ డీబీఎస్ కోవిడ్ -19 విపత్కర సమయంలో సాయం  అందించడానికి ముందుకు వచ్చింది. అందుకోసం రూ. 6.5 మిలియన్ సమీకరించినట్లు డిబిఎస్ సంస్థ వెల్లడించింది. వీటిద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. అందుకు  ప్రముఖ స్వచ్చంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌ భాగస్వామ్యంతో డీబీఎస్ చేతులుకలిపింది. ఒక్కో కుటుంబానికి రూ . 2వేల విలువైన నిత్యావసర సరుకులు అందించారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని 300 కుటుంబాల వారికి అండగా నిలిచింది. ఇప్పటివరకూ 4లక్షల 35వేల కు పైగా భోజనాలను అందించడంతో పాటు, ఆస్పత్రులకు వేగవంత మైన ర్యాపిడ్ టెస్టుల కు సంబంధించిన సామాగ్రి అందించారు. 10.5 మిలియన్ డాలర్ల తో నిరుపేదలను ఆదుకోవడానికి డీబీఎస్ సిధ్దంగా ఉన్నట్లు తెలిపింది. డీబీఎస్ స్ట్రాంగర్ టుగెదర్ ఫండ్ ద్వారా సింగపూర్, హాంగ్‌కాంగ్, చైనా, ఇండియా, ఇండొనేషియా, తైవాన్‌ల పలు సేవాకార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. 


logo