సోమవారం 01 జూన్ 2020
National - May 10, 2020 , 22:19:15

కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్

కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్


విజయవాడ :కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా ఉండే ప్రమాదం ఉంది. అలాంటి వారిని గుర్తించడంలో నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం అయింది. ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారు. లక్షణాలు కనిపించని వారికి టెస్టులు జరిపి ,మిగతా వారిని  వ్యాధి సోకకుండా కాపాడడంలో అధికార యంత్రాంగం విజయవంతమైంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా నమోదైన 75 శాతం మంది బాధితుల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలేవీ కనిపించలేదని పరిశీలనలో తేలింది. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి వైరస్ సోకిన వారిలో లేకపోవడం అధికారులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా రాష్ట్రాల్లో లక్షణాలు కనిపించిన తర్వాత కూడా టెస్టులు చేయలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కోవిడ్‌ బాధితులను గుర్తించడంలో యంత్రాంగం సక్సెస్ సాధించిందని కేంద్ర బృందం ప్రశంసించింది. ఇప్పటివరకూ నమోదైన 1,930 పాజిటివ్‌ కేసుల్లో సుమారు 1,500 మంది బాధితులకు కోవిడ్‌ లక్షణాలే కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లడంతో లక్షణాలు లేకపోయినా గుర్తించింది. కంటైన్మెంట్‌ క్లస్టర్లు, హాట్‌ స్పాట్లను మ్యాపింగ్‌ చేయడం ద్వారా ఎక్కువ మందికి టెస్టులు చేశారు.  


logo