శనివారం 06 జూన్ 2020
National - May 10, 2020 , 21:56:39

అసోంలో 13వేల పందులు మృతి

అసోంలో 13వేల పందులు మృతి


ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. అసోంలోని పందులను ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వేధిస్తున్నది. కొన్ని రోజులుగా అసోంలోని పలు జిల్లాలో ఆఫ్రికన్‌ ఫీవర్‌ విస్తరిస్తుండడంతో ఈ వ్యాధి బారిన పడి 13వేల పందులకు పైగా మృత్యువాతపడ్డాయి. ఈ విషయాన్ని అక్కడి పశు సంవర్థక శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడ తొలి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ కేసు నమోదైంది.పందుల్లో ఈ వ్యాధి విస్తరణ ఎక్కువ అవుతున్న క్రమంలో ఆ వ్యాధిని నివారించేందుకు రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి రంగంలోకి దిగారు. సమీక్ష నిర్వహించి.. స్వైన్ ఫీవర్‌ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. 1921లో తొలిసారిగా ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ను ఆఫ్రికాలో గుర్తించారు. చైనాలోని జినియాంగ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న అసోంకు అక్కడి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.



logo