బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 21:08:51

ఏపీలో భారీగా తగ్గిన లిక్కర్ అమ్మకాలు

 ఏపీలో భారీగా తగ్గిన లిక్కర్ అమ్మకాలు

అమరావతి: లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే శనివారం వరకూ లిక్కర్ అమ్మకాలు ఓ రేంజ్ లో ఉండగా. ఆదివారం ఒక్కసారిగా తగ్గిపోయాయి. మే 4న రూ . 70 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మే 9న రూ . 40.77 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు.  మద్యం ధరలను 75 శాతం పెంచడంతోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మద్యం విక్రయించే దుకాణాల సంఖ్యను 13 శాతం తగ్గించింది.  దీంతో ఆదివారం ఏపీలో లిక్కర్ అమ్మకాలు భారీగా తగ్గాయి. 


logo