శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 20:43:19

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా నిలుస్తాం: పవన్ కళ్యాణ్

 ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా నిలుస్తాం: పవన్ కళ్యాణ్


ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు ప్రభావంతో విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామ ప్రజకు అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్.ఆర్.వెంకటాపురంతోపాటు పరిసరాల్లోని పద్మనాభ నగర్, వెంకటాపురం, ఎస్సీ,బీసీ కాలనీ, నందమూరి నగర్ ప్రాంతాలవారికి ఈ పరిశ్రమతో ముప్పు పొంచి ఉందనిభయాందోళనలకు గురవుతున్న విషయం తన  దృష్టికి వచ్చిందని, ఆ బాధిత ప్రాంతాల ప్రజలు ఈ సంస్థను అక్కడి నుంచి తరలించాలనే ప్రధాన డిమాండ్ తోపాటు పలు విషయాలను తెలియచేస్తూ పవన్ లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటుంది. ప్రజల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. 


logo