గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 20:28:39

విమానాశ్రయాన్ని పరిశీలించిన సిపి ద్వారకా తిరుమల రావు

  విమానాశ్రయాన్ని పరిశీలించిన సిపి ద్వారకా తిరుమల రావు


గన్నవరం: విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం నగర పోలీస్  కమీషనర్ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. దుబాయ్, కువైట్ లలో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా ఇక్కడికి తరలిస్తుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఏర్పాట్లపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అధికారులతో సమీక్షించారు.. సుమారు 150 మంది వచ్చే అవకాశం ఉండటంతో వారికి పెయిడ్ క్వారెంటన్, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటన్ లకు తరలించడానికి కావల్సిన ఏర్పాట్లపై విమానాశ్రయ అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడారు.. విమానాశ్రాయానికి ప్రత్యేక విమానంలో వచ్చే వారందరికి  వైద్య పరీక్షలు జరిపి అనంతరం క్వారెంటన్ లకు తరలిస్తామని సీపీ ద్వారాకా తిరుమల రావు పేర్కొన్నారు


logo