ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 20:20:08

ఏజెన్సీ రిజర్వేషన్లపై దృష్టి సారించిన సీఎం జగన్

  ఏజెన్సీ రిజర్వేషన్లపై దృష్టి సారించిన సీఎం జగన్

అమరావతి:  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతంలో టీచర్స్‌ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్‌ 3ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో..ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను  ఆదేశించారు. ఈ విషయంపై అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌తో సమీక్ష జరిపిన జగన్‌ గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కనుక, తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని,ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.


logo