శనివారం 06 జూన్ 2020
National - May 10, 2020 , 19:52:55

పెండ్లి చేసుకుంటే ఇక అనుమతి తప్పనిసరి

పెండ్లి చేసుకుంటే ఇక అనుమతి తప్పనిసరి

హైదరాబాద్: పెండ్లంటే బాజాలు, పందిళ్లు, బంధువులతో సందడి ఉంటుంది. రాబోయే రోజుల్లో అవన్నీ మరచిపోవాల్సిందే.. వివాహాలు సాదాసీదాగా చేసుకోవాల్సిపరిస్థితులేర్పడుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలోఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండానే పెండ్లిళ్లు చేసుకోవాలి. ఈ విషయంలో ధనిక , పేద అనే తేడాలేమీ లేవు. అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం వివాహాలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కల్లెక్టర్ల సూచనల మేరకు ముందుగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో వివాహ వేడుక ప్రాంతాన్ని పరిశీలించి పురోహితుడుతో పాటు వరుడు, వధువు తరపున ఎంతమంది హాజరవుతరన్న వివరాలను ముందుగా తెలపాల్సి ఉంటుంది.అంతేకాదు భౌతిక దూరం, మాస్కులు ధరించడం, పరిశుభ్రత ఖచ్చితంగా పాటిస్తామంటూ ఓ ప్రమాణ పత్రంపై సంతకం చేసి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.  


logo