శనివారం 06 జూన్ 2020
National - May 10, 2020 , 17:36:06

అపస్మారక స్థితికి చేరుకున్న లోకో పైలట్లు

అపస్మారక స్థితికి చేరుకున్న లోకో పైలట్లు


విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విడుదలైన స్టైరీన్‌ గ్యాస్‌ విశాఖ నగరంపై ఇంకా ప్రభావం చూపుతున్నది. ఈరోజు ఉదయం గోపాలపట్నం సమీపంలో 45 నిమిషాల పాటు గూడ్స్‌ రైలు ఆగింది. ఆ సమయంలో ఎక్కువ సేపు అక్కడ గాలి పీల్చిన ఇద్దరు లోకోపైలట్లు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న లోకో పైలట్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్‌ ఇచ్చిన తర్వాత వారి పరిస్థితి మెరుగైంది. స్టైరీన్‌ గ్యాస్‌ ప్రభావం వల్ల విశాఖలో ఇప్పటి వరకు ఐదుగురు లోకో పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తర్వాత వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈఘటన తర్వాత ఆ మార్గంలో గూడ్స్‌ సహా మిగిలిన రైళ్లను అధికారులు నిలిపివేశారు.logo