సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 22:19:04

ఏపీకి వచ్చేందుకు 30వేల మంది రిజిస్ట్రేషన్‌

 ఏపీకి వచ్చేందుకు 30వేల మంది రిజిస్ట్రేషన్‌


 విజయవాడ: ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు విజ్ఞప్తి చేశారు. వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వస్తాయని చెప్పారు.  ఆయా విమానాల్లో మన వారిని సిద్ధంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..  ఏపీకి చేరుకున్నవారికి రెండు రకాల క్వారంటైన్లు సూచిస్తున్నామనీ.. పెయిడ్‌, ఉచిత క్వారంటైన్‌లలో ఏదైనా ఎంచుకోవచ్చన్నారు. ఇప్పటివరకు 30వేల మంది ఏపీ వాసులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.  


logo