బుధవారం 27 మే 2020
National - May 09, 2020 , 22:11:44

ప్ర‌జా సంక్షేమమే ముఖ్యం :మంత్రి కురసాల కన్నబాబు

 ప్ర‌జా సంక్షేమమే ముఖ్యం :మంత్రి కురసాల కన్నబాబు

 విశాఖపట్నం: ఎల్‌జి పాలిమర్స్ గ్యాస్ లీకేజి పొల్యూషన్ పూర్తి స్థాయిలో అదుపులో ఉందని జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్ర‌జా సంక్షేమమే ముఖ్యమని అందుకోసం ఎపి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎల్.జి.పాలీమర్స్ గ్యాస్ లీకేజి పొల్యూషన్ పై ఆయన మాట్లాడారు. లీకేజి ప్రభావం నుంచి  ఆ ప్రాంతం కోలుకుంటుందని, గాలిలో కలసిన గ్యాస్ ప్రభావం తగ్గుతుందని, 8వ తేదీ రాత్రి 7 గంటలకు 17.5 పిపిఎం ఉన్నదని, ప్రస్తుతం 1.9 పిపిఎం ఉన్నదని, చాలా వేగంగా తగ్గుతుందని చెప్పారు.  స్టోరేజి పాయింట్ వద్ద చాలా వేగంగా తగ్గుతుందన్నారు. అక్కడ పెద్ద ఎత్తున నీటిని నిలువ చేయడం జరుగుతుదని,  గ్రామాల వద్ద పారా మీటర్లను అధ్యయనం చేసి ఐదు  గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు వెళ్లవచ్చుని ప్రకటిస్తారని తెలిపారు. అంతర్గత కమిటీ ఉంటుందని, ఇందులో ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుందని తెలిపారు.  ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫసర్లతో ఒక కమిటీ ఉంటుందని, ఇందులో ఎస్. బాల ప్రసాద్ అధ్యక్షతన వివిధ రంగాలలో అధ్యయనం చేస్తుందని చెప్పారు.  ఐఐఎస్ఇఆర్ అధ్యయనం చేసి సూచనలు, సాంకేతిక అంశాలపైన సలహాలు ఇస్తారన్నారు.  కేబినెట్ కార్యదర్శి ఒక కమిటీని పంపిస్తున్నారని, ఇందులో ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారని పేర్కొన్నారు.  నేషనల్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (నీరి) నుండి ఐదుగురు సభ్యులతో కూడి బృందం వచ్చి నీటి వనరులు, తదితర వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తత చేసే సూచనలు ఇస్తుందని, ఎన్డిఆర్ఎఫ్ నుండి నాగ్ పూర్ నుండి ఒక టీం వచ్చిందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిదేదికలను ప్రభుత్వానికి అందజేస్తారని  పేర్కొన్నారు.  మెడికల్ అండ్ హెల్త్ కమిటీ ఉంటుందని ఇందులో డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, కెజిహెచ్ పర్యవేక్షకులు ఉంటారని, వీరు గ్యాస్ లీకేజి ప్రజలపై  ఏ విధమైన ప్రభావం చూపుతుందనే విషయాలను అధ్యయనం చేస్తారని, వీరు రేపటి నుండే అధ్యయనం ప్రారంభిస్తారని మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు.   వివిధ కమిటీల అధ్యయనం తరువాత ఇచ్చిన నివేధికలు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, అంతవరకు కంపెనీ తెరవమని ఆయన  చెప్పారు. 


logo