బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 17:33:22

విజయనగరం జిల్లాలో నమోదైన తొలి కరోనా మరణం

 విజయనగరం జిల్లాలో నమోదైన తొలి కరోనా మరణం

విజయనగరం : ఎపి విజయనగరం జిల్లాలోని బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు కిడ్నీ సమస్యతో బాధపడు తున్నది.  ఈ నేపథ్యం లో ఆమెను విశాఖపట్నం లోని ఆసుపత్రి లో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అక్కడి నుంచి ఆమెను విమ్స్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తుండగా  శనివారం మృతి చెందింది. దీంతో విజయనగరం జిల్లాలో తొలి కరోనా మృతి కేసు నమో దయింది .  


logo