బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 07:30:58

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఎస్‌ఐ, నలుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఎస్‌ఐ, నలుగురు మావోలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో తుపాకులు గర్జించాయి.. మావోయిస్టులు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఎస్సై మృతి చెందగా, నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లాలోని మదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో పోలీస్ పార్టీ శుక్రవారం రాత్రి మానపూర్ నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్ కి వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే అంబూష్ వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు.

దీంతో అప్రమత్తమైన పోలీస్ పార్టీ మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు నలుగురు మావోయిస్టులతో పాటు,  ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ జితేంద్ర శుక్ల సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధం, రెండు .315 బోర్ రైఫిల్స్ ను పోలీసులతో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


logo