శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 23:51:34

వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక నిర్ణయాలు

  వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక నిర్ణయాలు


అమరావతి :లాక్‌డౌన్ సడలింపుల‌ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలోని ‌ప్రధాన మార్కెట్లను రేపటి నుంచి 24 గంటల పాటు తెరవాలని ముఖ్యమత్రి ఆదేశించారన్నారు. అలాగే ఈ నెల 15న రైతు భరోసా అందిస్తా మని తెలిపారు. రైతు భరోసాకి అర్హతలు ఉండి నమోదు చేసుకోనివారికి ఈ నెల పది వరకు అవకాశం కల్పించామని కన్నబాబు చెప్పారు.


logo