బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 23:31:40

లిక్కర్ హోమ్ డెలివరీ యోచనలో జొమాటో

లిక్కర్  హోమ్ డెలివరీ యోచనలో జొమాటో


హైదరాబాద్ : లాక్ డౌన్ నుంచి మద్యం దుకాణాలకు సడలింపు ఇచ్చిన తర్వాత వైన్ షాపులు తెరవడంతో గంటల తరబడి నిరీక్షించి మరీ కొనుగోలు చేస్తున్నారు జననాలు .  ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మద్యం డెలివరీ చేయాలని భావిస్తున్నది. 40 రోజుల తరువాత  వైన్ షాపులు తెరవడంతో సామజిక దూరం పాటించకుండా నిల్చొవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వస్తున్నది. లిక్కర్ పై ఢిల్లీ ప్రభుత్వం 70 శాతం సెస్ వేయగా మహారాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది. మద్యం రేట్లు భారీగా పెంచినప్పటికీ కూడా మందుబాబులు షాప్స్ ముందు భారీగా క్యూ కట్టడంతో పోలీసులు కూడా వారిని కొన్ని చోట్ల అదుపు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మద్యాన్ని హోం డెలివరీ చేయాలనీ కొన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. జొమాటో ఇప్పటికే కిరాణా వస్తువులను కూడా అందజేస్తున్నది. దేశంలో ప్రస్తుతం ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు చట్టపరమైన నిబంధణలు లేవు. కానీ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రం జొమాటో ఇతర సంస్థల ద్వారా విక్రయాలు జరిపించాలని అనుకుంటున్నది. లిక్కర్ హోం డెలివరీ ద్వారా మందు వినియోగం బాధ్యతయుతంగా జరుగుతోందని జొమాటో భావిస్తున్నది. 


logo