బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 22:37:24

బీమా సంస్థలకు సీఎం జగన్ లేఖ

  బీమా సంస్థలకు సీఎం జగన్ లేఖ

 అమరావతి : ఏపీ సీఎం జగన్ ఎల్ఐసీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలకు లేఖ రాశారు. ఆయా సంస్థల చైర్మన్లు ఎంఆర్ కుమార్, గిరీశ్ రాధాకృష్ణన్ లను ఉద్దేశించి రాసిన ఆ లేఖల్లో... ప్రధాని జనజీవన్ బీమా, ఆమ్ ఆద్మీ బీమా యోజన క్లెయిమ్ లను      పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని సురక్ష బీమా యోజన పెండింగ్ క్లెయిమ్సు సత్వరమే పరిష్కరించాలని కోరారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని, అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని లేఖలో వివరించారు. 


logo