శుక్రవారం 05 జూన్ 2020
National - May 08, 2020 , 21:51:40

ఇదేమని అడిగితే చితకబాదిన పార్టీ కార్యకర్త

ఇదేమని అడిగితే చితకబాదిన పార్టీ కార్యకర్త


సూరత్: సాధారణ రైలు టికెట్ ధర కంటే మూడు రెట్లు అధికంగా వసూలు చేయడాన్ని ప్రశ్నించిన ఓ వలస కార్మికుడిని దారుణంగా చితకబాదాడు బీజేపీ కార్యకర్త. వలస కార్మికుడిని బీజేపీ కార్యకర్త చితకబాదిన విషయం వైరల్ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీపై దుమ్మెత్తిపోసింది. దీంతో స్పందించిన బీజేపీ వలస కార్మికులపై దాడిచేసిన వ్యక్తికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిందీ ఘటన. తనను తాను బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్న రాజేశ్ వర్మ జార్ఖండ్ వెళ్లాలనుకుంటున్న కొందరు వలస కార్మికుల నుంచి మొత్తం లక్ష రూపాయలు వసూలు చేశాడు. విషయం తెలిసిన ఓ కార్మికుడు వాసుదేవ్ వర్మ.. బీజేపీ కార్యకర్త రాజేశ్ వర్మ వద్దకు వెళ్లి అసలు ధర కంటే మూడు రెట్లు ఎందుకు వసూలు చేశారని ప్రశ్నించాడు. దీంతో  రెచ్చిపోయిన రాజేశ్ వర్మ, అతడి అనుచరులు వాసుదేవ్ వర్మపై కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. వైరల్ అవుతున్నఈ వీడియోపై సూరత్ బీజేపీ చీఫ్ స్పందించారు. రాజేశ్ వర్మ బీజేపీ కార్యకర్త కాదని తేల్చి చెప్పారు. 


logo