బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 21:25:06

కాస్టింగ్ కౌచ్‌ పై స్పందించిన హీరోయిన్

 కాస్టింగ్ కౌచ్‌ పై స్పందించిన హీరోయిన్


కాస్టింగ్ కౌచ్‌  గత కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కాస్టింగ్ కౌచ్‌  ఓ ఊపు  ఊపేసింది . చిన్న చిన్న తారల దగ్గర్నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ వరకు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా ఇదే విషయం పై అందాల  భామ అదాశర్మ స్పందించింది. "కాస్టింగ్ కౌచ్‌ కు అక్కడ ఇక్కడ అనే తేడా లేదు.  ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది.  ఇక్కడ బలవంతం ఉండదు. నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. మనకు ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చెయ్యరు. మహిళలు అన్ని చోట్లా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు " అని ఆదాశర్మ చెప్పింది.  


logo