మంగళవారం 26 మే 2020
National - May 08, 2020 , 20:54:54

స్టార్ హోటళ్లలో పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలు

స్టార్ హోటళ్లలో పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలు

 అమరావతి : విదేశాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన వారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. 64 ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని వచ్చినట్టే 14రోజులపాటు క్వారం టైన్ కు తరలించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల ఒడిశా సర్కారు స్టార్ హోటళ్ల లో పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఏపీ లో నూ  సకల సౌకర్యాలతో వాటిని సిద్ధం చేస్తున్నది అక్కడి ప్రభుత్వం.  అందుకోసం ఇప్పటికే విజయవాడలో పలు హోటళ్లు, లాడ్జ్ లను ఆధీనంలోకి తీసుకు న్నారు అధికారులు . వీటిలో  విదేశాల నుంచి విజయవాడ కు వచ్చే వారిని పెయిడ్ క్వారెంటేన్ లో పెట్టనున్నది. విమానాశ్రయాల నుంచి ప్రత్యేక బస్సు ల్లో  హోటళ్లకు తరలించేందుకు  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  


logo