ఆదివారం 31 మే 2020
National - May 08, 2020 , 18:05:45

హోంలోన్‌ వినియోగదారులకు షాక్‌

హోంలోన్‌ వినియోగదారులకు షాక్‌

హోంలోన్‌ వినియోగదారులకు ఎస్‌బీఐ షాక్‌ ఇచ్చింది. హోం లోన్‌ పై ఉన్న రిస్క్‌ ప్రీమియంను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద ఎత్తున వినియోగదారులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం కేవలం రెపో రేటుతో అనుసంధానం అయిన వాటికి మాత్రమే వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ నిర్ణయంతో రుణగ్రహీతలు తీసుకున్న రుణాలపై కొంత మేర పెరుగుదల ఉంటుంది. అయితే ఈ మార్పులు మే 1వ నుంచే అమలులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.


logo