శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 23:11:42

పల్లెల్లో పెరుగుతున్నఇంటర్నెట్ యూజర్ల

పల్లెల్లో పెరుగుతున్నఇంటర్నెట్ యూజర్ల


హైదరాబాద్ : లాకా డౌన్ నేపథ్యంలో భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువగా ఉన్నది. ఈ విషయం ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), నీల్సన్ తాజా నివేదికలో వెల్లడైంది. 2019 నవంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 22.7 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లతో పోలిస్తే ఈ సంఖ్య 10 శాతం ఎక్కువ. పట్టణాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 20.5 కోట్లుగా ఉంది. దాదాపు 7.1 కోట్ల మంది  5-11 ఏండ్ల వయసు వారు స్మార్ట్‌ఫోన్స్ తో ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. దీంతో దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50.4 కోట్లకు చేరింది.  ప్రపంచంలో చైనా తర్వాత భారత్ ఇప్పుడు రెండో అతిపెద్ద దేశంగా కొనసాగుతున్నది . చైనాలో దాదాపు 85 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. 


logo