బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 22:00:09

వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే...?

వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే...?


 ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 వైరస్ రెచ్చిపోతుండడంతో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో  పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయించుకుంటున్నాయి. ఇటువంటి వారి పనితీరుపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది.  అందులో ప్రతి ఇద్దరిలో ఒకరు పోర్న్ వీడియోలు, సమాచారం ఎక్కువగా చూస్తున్నట్లు తేలింది. సుమారు 18 శాతం మంది తమ కంపెనీ అందించిన  ల్యాప్ టాప్ లలో చూస్తుండగా ,33 శాతం మంది తమ వ్యక్తిగత  ల్యాప్ ట్యాప్, మొబైల్లో  పోర్న్ వీడియోలు చూస్తున్నారట.  ఉద్యోగులు తమ సందర్శించే వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తవహించకపోతే మాల్‌వేర్ వైరస్‌లు అటాక్ చేసే ప్రమాదమున్నదని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై నివేదిక లో వెల్లడైంది. అంతేకాదు సమాచారాన్ని బహిర్గతం చేయడమే కాకుండా , ఐటీ నుంచి వచ్చే ప్రమాదాలను పెంచుతుందని తెలిపింది. దాదాపు 31 శాతం ఉద్యోగులు  ఇప్పుడు ఎక్కువ సమయం పనిచేస్తున్నామన్నారు . అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో తమ వ్యక్తిగత పనుల కోసం కేటాయించే సమయాన్ని పెంచామని 46శాతం మంది అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది కార్మికులు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వార్తలను చదువుతున్నామని చెప్పారు. 42 శాతం మంది ఉద్యోగులు ఆఫీసు పని కోసం  వ్యక్తిగత ఈమెయిల్స్ ఉపయోగిస్తున్నారు.  49 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేటప్పుడు తమ వినియోగం పెరిగిందని అంగీకరించారు. 38 శాతం మంది తమ  సంస్థ ఐటీ విభాగాలు ఆమోదించని వ్యక్తిగత మెసెంజర్లను ఉపయోగిస్తున్నారు. వారిలో 60 శాతం మంది ఎక్కువగా కష్టపడుతున్నారట.  


logo