బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 21:29:17

తగ్గుముఖం పడుతున్నకరోనా

 తగ్గుముఖం పడుతున్నకరోనా


 దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఓ వైపు పెరుగుతుంటే.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా ముక్త్ రాష్ట్రాలుగా మారాయి. తాజాగా కేరళలో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా.. అక్కడ కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ బాటలో ఉత్తరాఖండ్‌ కూడా చేరనుంది. కరోనా కట్టడిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం విజయం సాధిస్తున్నది. గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు కొత్తగా ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 61 నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 21 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


logo