శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 21:10:11

గ్యాస్ లీక్ ఘ‌ట‌నలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

గ్యాస్ లీక్ ఘ‌ట‌నలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

విశాఖలో జ‌రిగిన గ్యాస్ లీక్ ఘ‌ట‌న ఎంద‌రికో క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. ప‌చ్చ‌ని ప‌రిస‌రాల‌ను విష‌తుల్యంగా మార్చేసింది. ఈ దుర్ఘటనలో విషవాయువు పీల్చి ఎంబీబీఎస్ విద్యార్థి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో మెరిట్ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటును దక్కించుకునాడీ విద్యార్థి.  చంద్రమౌళి తల్లిదండ్రులకు కొడుకు మరణం తీరని శోకం మిగిల్చింది.


logo