శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 19:52:34

జమ్మూకాశ్మీర్‌ విభాగంలోనే పీఓకే వాతావరణ సూచనలు

జమ్మూకాశ్మీర్‌ విభాగంలోనే పీఓకే వాతావరణ సూచనలు

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పై ప్రాదేశిక హక్కులను సూచించేలా జమ్మూ కాశ్మీర్ ఉపవిభాగం జాబితాలో భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం మార్పు చేసింది. ఇతర దేశాలకు కూడా వాతావరణ సూచనలు చేస్తున్న ఐఎండీ ప్రస్తుతం పీఓకేలోని ప్రాంతాలను జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా చూపిస్తూ వాతావరణ సూచనలు వెలువరిస్తుంది. గిల్గిట్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లను వాతావరణ శాఖ బులెటిన్‌లో చేర్చారు అధికారులు. దీంతో మంగళవారం నుండి ఐఎండీ తన వెబ్‌సైట్‌లో వాయువ్య ఉపవిభాగంలో భాగంగా గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, స్కార్డు, నీలమ్‌ ప్రాంతాల వాతావరణ సూచనను చూపిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల సూచనలను జాతీయానికి బదులుగా ప్రాంతీయ బులెటిన్ కింద పేర్కొనాలని ఐఎండీ నిర్ణయించింది.

జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతానికి ఐఎండీ వాతావరణ బులెటిన్ జారీ చేస్తోంది. ముజఫరాబాద్‌, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలు భారతదేశంలోని భాగాలు కాబట్టి మేము వాటిని కూడా ప్రస్తావిస్తున్నాము అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా అన్నారు. చాలా కాలంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మొదలైన దేశాలకు ఐఎండీ పలు వాతావరణ సూచనను జారీ చేస్తోంది. మేము ఈ సమాచారాన్ని మా జాతీయ బులెటిన్లో ప్రస్తావించాము. గత 2 రోజులుగా, మేము మా ప్రాంతీయ బులెటిన్‌లో ఈ సమాచారాన్ని ప్రస్తావించడం ప్రారంభించాము అని డిజి మోహపాత్రా చెప్పారు.


logo