శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 00:18:39

ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన ఏపీ ఉన్నత విద్యామండలి

ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన ఏపీ ఉన్నత విద్యామండలి


అమరావతి: దేశవ్యాప్తంగా  లాక్‌డౌన్‌ విధించడంతో ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను  వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంసెట్‌తో పాటు లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌, ఈసెట్‌ ‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. హేమచంద్ర రెడ్డి వెల్లడించారు.
ఉన్నత విద్యామండలి ప్రకటించిన పరీక్ష తేదీలు
ఎంసెట్‌ : జులై 27 నుంచి 31 వరకు
ఈసెట్‌ : జులై 24
ఐసెట్  : జులై 25న
పీజీసెట్ : ఆగస్ట్‌ 2 నుంచి 4
ఎడ్ సెట్  : ఆగస్టు 5
లా సెట్ :  ఆగష్టు  6
ఈసెట్  : ఆగష్టు 7 నుంచి 9 వరకు.


logo