సోమవారం 01 జూన్ 2020
National - May 06, 2020 , 20:41:50

మాతృదినోత్సవాన్ని ఇలా జరుపుకోమంటున్న సెలెబ్రిటీలు

మాతృదినోత్సవాన్ని ఇలా జరుపుకోమంటున్న సెలెబ్రిటీలు

 
 ఢిల్లీ : భారతదేశంలో కుటుంబ ఆరోగ్య సంరక్షకులు మాతృమూర్తులు. తమ కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని నిర్వహించడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మన మాతృమూర్తులు అనుసరించే జీవనశైలితో  అనారోగ్యం పాలు అవుతున్నారు.  అందుకోసమే అటువంటి మాతృమూర్తులకు ప్రముఖులు ఈ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని పోషకాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజువారీ ఆహారం లో గుప్పెడు బాదంలు తినడం వల్ల కలిగే  వివరిస్తున్నారు.  "మన కుటుంబసభ్యుల ఆరోగ్యంతో పాటుగా మన సొంత ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు కూడా తగిన ప్రయత్నాలు చేయడం కూడా అంతే ముఖ్యమని నేను నమ్ముతున్నాను. తల్లిగా, మనం తరచుగా మన సొంత ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం . మన కుటుంబ సభ్యుల ప్రయోజనాలు , ఆరోగ్యానికి  అత్యంత ప్రాధాన్యతనిస్తుంటాం.  అందుకు మంచి జీవనశైలి కలిగి ఉండటంతో పాటు పోషకాహారాన్ని తీసుకోవాలని " బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ అన్నారు. తాను పోషకాహారం  బాదం లు తీసుకుంటానని చెప్పారు. నా ఆరోగ్యపు అలవాట్లలో చాలావరకూ మా అమ్మ దగ్గర నుంచి వచ్చాయి. నా చిన్నతనంలో ఆమె ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతమైన ఆహారంతోనే నా రోజు ప్రారంభించాలని కోరుకునే వారు. నా బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా బాదం లు అందించేది.  ఇప్పుడు ఆమె వయసు 81ఏండ్లు . ఆమె ఇప్పటికీ నా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు  బాదం తీసుకుంటున్నానా లేదా అని చూస్తుంటారు. అలాగే ఆమె కూడా తీసుకుంటారు! ''అని ఫిట్‌నెస్ ఎక్స్ పర్ట్,  సూపర్‌మోడల్ మిలింద్ సోమన్ అన్నారు."నేనెప్పుడూ కూడా ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాలనే కోరుతుంటాను, మరీ ముఖ్యంగా తల్లులకు! దీనిని చేసేందుకు ఓ మార్గం, శాచురేటెడ్ ఫ్యాట్స్‌ను తీసుకోవడం తగ్గించడంతో పాటుగా మోనోశాచురేటెడ్ ఫుడ్స్ అయిన బాదం లాంటి వాటిని తీసుకోవాలి. వీటిలో అధిక సంఖ్యలో పోషకాలు ఉండటంతో పాటు, ప్రొటీన్లు కూడా అధికంగా ఉంటాయని న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. 


logo