మంగళవారం 26 మే 2020
National - May 06, 2020 , 01:20:59

రూ .90 కోట్ల విరాళం తో సేవా కార్యక్రమాలు చేస్తున్న మిలాప్

రూ .90 కోట్ల విరాళం తో సేవా కార్యక్రమాలు చేస్తున్న మిలాప్


దక్షిణాసియాలో అతిపెద్ద ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్ మిలాప్  ఆకలితో అలంటించువారికి అండగా  నిలిచేందుకు ముందుకు వచ్చింది. అందుకు రూ . 90 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఈ ఆన్‌లైన్ ఫండింగ్ క్యాంపెయిన్ ను కేవలం పలు ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలసకార్మికులు, రోజువారీ కూలీలకు నిత్యావసరాలు , కమ్యూనిటీ కిచెన్‌ల ద్వారా ఆహారాన్ని అందించడమే కాకుండా, ట్రాన్స్ జెండర్స్, మేల్ సెక్స్ వర్కర్లు, సర్కస్ ఆర్టిస్ట్‌లు, డ్రైవర్లు, డెలివరీ పర్సన్స్, గ్రామీణ కళాకారులు, డ్యాన్సర్లు, ఫ్రీలాన్స్ వర్కర్లు వంటి కమ్యూనిటీలకు సైతం సహాయం అందించడానికి నిర్వహిస్తున్నారు." చెన్నై, అస్సామ్, కేరళలలో వరదలు వంటి ప్రకృతి సహజ విపత్తులు సంభవించిన సమయంలో సైతం క్రౌడ్ ఫండింగ్ ప్రజలను ఏకం చేయడంతో పాటుగా తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి సహాయపడింది. ప్రతి ఒక్కరి జీవితమూ ఏదో ఒక రూపంలో ప్రభావితమవుతున్న ఈ కష్టకాలంలో ఇది ఓ ఆశాకిరణంగా నిలుస్తుందని మిలాప్ కో ఫౌండర్, అధ్యక్షుడు  అనోజ్ విశ్వనాథన్ అన్నారు


logo