శనివారం 04 జూలై 2020
National - May 05, 2020 , 20:22:42

ఏపీలో షాక్ కొడుతున్నవిద్యుత్‌ బిల్లులు

 ఏపీలో షాక్ కొడుతున్నవిద్యుత్‌ బిల్లులు


 
ఏపీలో విద్యుత్తు బిల్లులు సామాన్యుల‌కు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల సగటు క‌రెంటు వినియోగం ఆధారంగా గ్రూప్‌ టారిఫ్‌ నిర్ణయించి విద్యుత్‌శాఖ బిల్లులు వసూలు చేస్తున్నది. దీనివల్ల మధ్యతరగతి విద్యుత్తు వినియోగదారునిపై ఒకేసారి భారం పడుతున్నది. కోవిడ్-19 కారణంగా మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్‌లో తీసే స్పాట్‌ బిల్లింగ్‌ను విద్యుత్తు శాఖ నిలిపేసింది. దీంతో వినియోగదారులు మార్చి నెలలో వినియోగించిన యూనిట్స్, ఏప్రిల్‌ నెల వినియోగించిన యూనిట్స్ తో కలిపి మే నెల‌లో విద్యుత్తు శాఖ బిల్లులను ఇస్తంది. దీని ఆధారంగా డిస్కంలు మేలో విద్యుత్తు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండ‌టం, గాడ్జెట్స్ వినియోగం పెర‌గ‌డం, వేసవి కాలం తోడవ్వడంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో గృహ విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. అంతేనా రెండు నెలల్లో వినియోగించిన మొత్తం యూనిట్లను కలిపి..వాటిని సగటు చేయడంతో కేటగిరి మారిపోయి భారీగా బిల్లులు వస్తున్నాయి.


logo