ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకునే హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉంటుంది టాలీవుడ్ భామ రకుల్ ప్రత్ సింగ్. అమ్మాయిలు ఎదుర్కొనే పీఎంఎస్ (ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్), పీసీవోఎస్, పీసీవోడీస్, పీసీవోడీ, మెనుస్ట్రుయేషన్, మెంటల్ హెల్త్ లాంటి సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో చెప్తుంది రకుల్. తన సీక్రెట్ డ్రింక్ ఎంటో ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.
ఇంట్లోనే అజ్వెయిన్ టీ తయారు చేసుకుని సేవిస్తే పీఎంఎస్ సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెప్తోంది. నొప్పి ఉంటే..నన్ను నమ్మండి..మీకు ఉపశమనం కలుగుతుంది అంటూ అజ్వెయిన్ టీ సేవిస్తున్న స్టిల్‌ను షేర్ చేసుకుంది. అజ్వెయిన్ టీని వాము విత్తనాలతో తయారు చేసుకోవచ్చు.