గురువారం 28 మే 2020
National - Apr 29, 2020 , 20:11:47

డాక్స్ యాప్‌తో ఫోన్ పే భాగస్వామ్యం

డాక్స్ యాప్‌తో ఫోన్ పే భాగస్వామ్యం


  హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్ననేపథ్యంలో డాక్స్ఆప్ రోగుల అవసరాలకు తగిన సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పేతో జట్టు కట్టింది. ఇలాంటి సంక్షోభ సమయంలో భారతీయులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సహాయ పడేందుకు డాక్స్ఆప్ నిర్ణయం తీసుకున్నది. డాక్స్ఆప్ ఇప్పుడు ఫోన్ పే లోని స్విచ్ వేదికలో ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నది. ఈ వేదిక ద్వారా వినియోగదారులు అప్పటికప్పుడే స్పెషలిస్టు డాక్టర్లను సంప్రదించవచ్చు. అవగాహన పెంచడంకోసం,డాక్స్ఆప్ లాక్‌డౌన్ సందర్భంగా ఫోన్ పే నిత్యావసరాల విభాగంలో కనిపిస్తుంది. 200 మిలియన్లకు పైగా ఉచితంగా  ఫోన్ పే  వినియోగదారులకు కరోనా సంబంధిత సందేహాలకు డాక్స్ఆప్ సమాధానాలివ్వడంతోపాటు, అవసరమైన సలహాలు,సూచనలు ఇవ్వనున్నది. అంతేకాక కోవిడ్ యేతర వ్యాధులకు సలహాలకోసం ఫీజుల్లో 90% వరకు డిస్కౌంట్ అందించనుంది. దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా తమ సేవలు అందించడానికి  సిద్ధంగా ఉన్నామని  ఫోన్ పే స్విచ్ విభాగం అధిపతి రితురాజ్ రౌతేలా తెలిపారు. డాక్స్ఆప్ , ఫోన్ పే ల భాగస్వామ్యం లో లక్షలాది మంది వినియోగదారులకు వారి ఇంటిలోనే భద్రంగా ఉంటూ ఏదైనా ఆరోగ్య సమస్యలపై విశ్వసనీయమైన డాక్టర్లను సంప్రదించే సౌకర్యాన్ని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డాక్స్ ఆప్  సీఈఓ  సతీష్ కన్నన్ మాట్లాడుతూ, “మానవ సమాజానికి సరికొత్త శతృవుగా పరిణమించిన కరోనాతో కలసి పోరాడేందుకు మనం అందరం కలసి కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. ఫోన్ పే సహాయంతో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉచితంగా సేవలు అందించడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాము. ”అని అన్నారు. డాక్స్ ఆప్ లో ఎవరైనా వ్యక్తులు తమ మాతృభాష లేదా తమకు సౌకర్యవంతమైన మరేదైనా భాషలో చాట్, కాల్ లేదా వీడియో ద్వారా స్పెషలిస్టు డాక్టర్లను సంప్రదించవచ్చు. అంతేకాకుండా మెడిసిన్స్ కొనడానికి కూడా వినియోగదారులకు ఈ వేదిక వీలు కల్పిస్తున్నది.


logo