బుధవారం 02 డిసెంబర్ 2020
National - Apr 26, 2020 , 21:56:33

కార్చిచ్చును ఆర్పేసిన కారుమబ్బులు

 కార్చిచ్చును ఆర్పేసిన కారుమబ్బులు


  మనిషి పర్యావరణానికి ముప్పు తెస్తాడేమో కానీ ప్రకృతి  మాత్రం అలా చేయదు.   ఒక్కోసారి ప్రకృతి పర్యావరణాన్నికూడా రక్షిస్తుంది. తిరుమల తిరుపతి కొండల్లో జరిగిన    ఈ ఘటన అందుకు నిదర్శనం నిలుస్తున్నది. శేషాచలం అడవుల్లో ఉన్న గుర్రపుకోన ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశాన్ని తాకుతున్నట్లు పొగలు,మంటలు కమ్మాయి. మంట ఎంతగా విస్తరిస్తుందోనని తిరుపతి వాసులంతా భయపడిపోయారు. ఎన్ని చెట్లు నాశనమవుతాయో, వన్యప్రాణాలు ఎన్ని చనిపోతాయోనని ఆందోళన చెందారు. ఇంతలో వర్షం కురిసింది. మంటలు చల్లారిపోయాయి. దీంతో  కార్చిచ్చును ఆర్పేసిన కారుమబ్బులను చూసి అక్కడి    ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.