శనివారం 04 జూలై 2020
National - Apr 25, 2020 , 01:09:39

మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి శంకరనారాయణ

 మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి శంకరనారాయణ


 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాద యాత్రలో ఇచ్చిన హా మీ  ప్రకారం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘ మహిళలకు అండగా నిలుస్తూ సున్న వడ్డీకే రుణాలు ఇస్తున్నారని, ఇంతటి గొప్ప కార్యక్రమం ప్రస్థుత గట్టు పరిస్థితుల్లో కూడ అక్క చెల్లెల్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  శ్రమిస్తున్నారని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణ ఎంపిడిఓ ఆఫిస్ వెనుక ఉన్న వెలుగు కార్యాలయం లో "వై.యస్.ఆర్.సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించి, చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అథిదిగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు మాలగూండ్ల శంకరనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన 10 కోట్ల 77 లక్షల విలువగల చెక్కును ఆవిష్కరించారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు మాట ఇచ్చిన ప్రకారం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించడానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా అప్పు నిల్వ కలిగిన స్వయం సహాయక సంఘాల బ్యాంకు విధించిన వడ్డీ రేటు ప్రకారం, వడ్డీ మొత్తాన్ని నేరుగా స్వయం సహాయక సంఘాల అప్పు ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు అర్హత కలిగిన ఎనిమిది లక్షల 78 వేల స్వయం సహాయక సంఘాలకు 1,400 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింద న్నారు.


logo