బుధవారం 21 అక్టోబర్ 2020
National - Apr 25, 2020 , 00:01:48

హైదరాబాద్‌లో స్థిరాస్తుల విలువ 9శాతం వృద్ధి చెందాయి

 హైదరాబాద్‌లో స్థిరాస్తుల విలువ 9శాతం వృద్ధి చెందాయిహైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ డిమాండ్ , సరఫరా పరంగా వృద్ధిలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ హైదరాబాద్‌లో స్థిరాస్తుల విలువ సానుకూల వృద్ధిని నమోదుచే స్తున్నది. ఇలారా టెక్నాలజీస్ సొంతమైన ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశపు ఫార్మా రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఆస్తుల విలువ 2019 జనవరి-మార్చి నడుమ ఉన్న ఆస్తుల ధరలతో పోలిస్తే 2020 సంవత్సరపు జనవరి -మార్చి మధ్య కాలంలో 9శాతం వృద్ధి చెందాయి.
2019 ఆర్ధిక సంవత్సరపు నాల్గవ త్రైమాసకంలో హైదరాబాద్‌లో ఫ్లాట్‌ల రమారమి ధరలు చదరపు అడుగుకు 4,977 రూపాయల నుంచి 2020 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసకంలో 5,434 రూపాయలకు వృద్ధి చెందింది. గత కొద్ది సంవత్సరాలుగా స్థిరంగా వృద్ధి చెందుతున్న ధరలు కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు భారతదేశపు ఇన్‌ఫర్మేషన్ క్యాపిటల్ బెంగళూరు ,ఇండియా ఆటోమొబైల్ తయారీకేంద్రం చెన్నైతో పోలిస్తే ఖరీదైనదిగా మారింది. నగరం రమారమి ఆస్తుల ధరలు 2020 ఆర్ధిక సంవత్సరం క్యు4 లో వార్షిక వృద్ధి
బెంగళూరు 5275 రూపాయలు/చదరపు అడుగు 3శాతం
చెన్నై 5184 రూపాయలు/చదరపు అడుగు మార్పులేదు
హైదరాబాద్ 5434 రూపాయలు/చదరపు అడుగు 9శాతం
 ప్రధానంగా కోవిడ్-19   కారణంగా నగరంలో గృహ విక్రయాలు 39శాతం పడిపోయాయి. మార్చి31,2020 నాటితో ముగిసిన త్రైమాసకంలో కేవలం 5,554 యూనిట్లు మాత్రమే విక్ర యాలు జరిగాయి. నూతన ఆవిష్కరణలైతే మరింతగా వేగంగా దిగజారాయి. గత సంవత్సరంతో పోలిస్తే 56శాతం ఇది తగ్గింది. మార్చి త్రైమాసకంలో, అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లో కేవలం 3,904 యూనిట్లు మాత్రమే ప్రారం భమయ్యాయి.  "గత కొద్ది సంవత్సరాలుగా స్థిరంగా వృద్ధి చెందుతున్న ధరలు హైదరాబాద్ నగరాన్ని అందుబాటు ధరలోని ఆస్తుల గమ్యస్థానం నుంచి మధ్య , విలాసవంతమైన విభాగపు గృహాల నిలయంగా మారుస్తుంది. ఈ కారణం గా అమ్మకాలతో పాటు  ఆవిష్కరణల పరంగా కూడా ఈ నగరంలో అందుబాటు ధరలలోని గృహాల వాటా చాలా తక్కువగా ఉంది'' అని హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో  ధృవ్ అగర్వాల్ అన్నారు. దేశంలోని చాలా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం పూర్తి భిన్నమైనది. ఇక్కడ అందుబాటు ధరలలోని గృహాల వాటా త్రైమాసకపు అమ్మకాలు, ఆవిష్కరణల పరంగా ఎక్కువగా ఉండేది. హైదరాబాద్‌లో ఈ త్రైమాసకంలో విక్రయించబడిన అన్ని గృహాలలో కేవలం 14శాతం యూనిట్ల ధరలు మాత్రమే ప్రభుత్వం నిర్వచించిన అందుబాటు ధరలలోని గృహ విభాగమైన 45 లక్షల రూపాయల వరకూ ఉన్నాయి. ఆవిష్కరణల పరంగా సైతం కేవలం 36శాతం యూనిట్ల ధరలు అందుబాటు ధరలలోని గృహ విభాగంలో ఉన్నాయి. ఇతర ప్రధానమైన రెసిడెన్షియల్ మార్కెట్‌లతో పోల్చినప్పుడు హైదరాబాద్ లో అతి తక్కువగా అమ్ముడుకాని గృహాల సంఖ్య ఉండటంతో పాటుగా అతి తక్కువగా ఓవర్‌హ్యాంగ్ గృహాల సంఖ్య కూడా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసకం నాటికి హైదరాబాద్ నగరంలో బిల్డర్ల వద్ద 31,118 యూనిట్ల అమ్ముడు కాని గృహాలు ఉన్నాయి. అమ్ముడుకాకుండా ఉన్న ఇన్వెంటరీ హౌసింగ్ స్టాక్‌లో దాదాపు 84శాతం గృహాల ధరలు 45 లక్షల రూపాయలకు పైబడిన ధరలలో ఉన్నాయి.


logo