హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గతేడాది కూడా శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు అనుమతించేదు. కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయడానికి అన్ని మతాల పండుగల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తేలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
గతేడాదిలో నిర్వహించినట్లుగానే పరిమిత సంఖ్యలోనే.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకను జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. స్వామివారి ఆలయంలోనే ఆగమ శాస్త్ర ప్రకారం నవమి వేడుకలను నిర్వహిస్తామన్నారు. కరోనా దృష్ట్యా భక్తులెవరూ సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీరామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని కోరారు. ఆన్లైన్లో కల్యాణ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల డబ్బులు తిరిగి చెల్లిస్తామని మంత్రి తెలిపారు. వేడుకల నిర్వహణపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు దర్శనాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. భక్తులు నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని కోరారు. వైరస్ విజృంభణ కారణంగా ఆలయంలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజ్ చేయాలని సూచించారు. భక్తులు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించటంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని, ఆలయ అధికారులకు భక్తులు సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జానారెడ్డి గతం.. టీఆర్ఎస్ భవిష్యత్తు: బాల్క సుమన్
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ఫిలిం ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ హీరోగా ఇర్ఫాన్, హీరోయిన్గా తాప్సీ
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!