శుక్రవారం 03 జూలై 2020
National - Apr 19, 2020 , 18:16:45

ఏపీ లో గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు బీమా సౌకర్యం

ఏపీ లో గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు బీమా సౌకర్యంకోవిడ్ -19 నియంత్రణలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి  ఏపీ సర్కారు బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చింది.  అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. కరోనా బీమా పరిధిలోకి  గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు,గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను చేర్చాలని జగన్ ఆదేశించారు.


logo