సోమవారం 13 జూలై 2020
National - Apr 14, 2020 , 13:54:06

ప్రధాని ప్రసంగం నిరాశాజనకం

ప్రధాని ప్రసంగం నిరాశాజనకం

దేశంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం దేశ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శించారు. తన ప్రసంగంలో మోదీ పేదలకు సాంత్వన, సహాయం అందించే అంశాన్ని కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు. ‘ప్రజలు ప్రధాని నుంచి కేవలం సలహాలు ఆశించటంలేదు. వారు ఇప్పుడు అత్యవసర సహాయం కోరుతున్నారు. ఇప్పుడు వారు బతకడానికి కావాల్సింది నిత్యావసర సరుకులు, కర్చులకు డబ్బు’ అని స్టాలిన్‌ అన్నారు. దేశంలో అత్యధికమంది పేదలు, నిరుద్యోగులేనని, చాలాచోట్ల కులవివక్షతో కనీసం తిండికూడా సంపాదించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.   


logo