సోమవారం 06 జూలై 2020
National - Apr 14, 2020 , 01:59:32

13 కోట్ల విరాళం ప్రకటించిన మాతా అమృతానందమయి

 13 కోట్ల విరాళం ప్రకటించిన మాతా అమృతానందమయి


మాతా అమృతానందమయి మఠం కరోనా  బాధితుల సహాయ నిధికి పదమూడు కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో పది కోట్లు ప్రధానమంత్రికి సహాయ నిధికి, మూడు కోట్లు కేరళ సి ఎం రిలీఫ్ ఫన్డ్ కు అందజే యనున్నారు. మఠం విడుదల చేసిన ప్రకటనలో " Covid'19 కారణంగా ప్రపంచం యావత్తూ అనుభవిస్తున్న బాధను చూసి మనసు తల్లడిల్లుతుందన్నారు  అమ్మ. Covid'19 వల్ల మృతి చెందిన వారి ఆత్మకు, వారి కుటుంబ సభ్యులకు  ప్రపంచానికి శాంతి చేకూరాలని ఆ భగవంతునికి ప్రార్థిద్దామన్నారు" అమ్మ కోరిక మేరకు అమృత విశ్వవిద్యాలయం, అమృత హాస్పిటల్ కలిసి Covid'19 కారణంగా ఒత్తిడికి, ఆందోళనకి, కుంగుబాటుకు గురైన వారికి సహాయం అందించడానికి ప్రత్యేకంగా హెల్ప్ లైను ఏర్పాటు చేశారు. వైద్యులను, ప్రత్యేకంగా మానసిక వైద్యులను Covid'19 బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సమయం కేటాయించాలని అభ్యర్థించారు అమ్మ. తాము నమ్మినా నమ్మకపోయినా రోజులో రెండు గంటలు సమయం అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్లిష్ట సమయంలో కౌన్సెలింగ్ కూడా ఒక సేవ లా భావించాలని అన్నారు.
మానవాళి జీవనశైలిని మార్చుకొని ప్రకృతితో సామరస్యంగా వ్యవహరించాలని లేదంటే ప్రకృతి వైపరీత్యాలకు గురికావాల్సి వస్తుందని దశాబ్దాలుగా అమ్మ నొక్కి చెబుతున్నారు. మానవుడు ప్రకృతి పట్ల స్వార్థంతో వ్యవహరించడం వల్లనే అంటువ్యాధులు ప్రబలుతున్నాయి అన్నారు, మనం ప్రకృతికి సేవకులం మాత్రమే అనే తత్వాన్ని పెంపొందించుకోవాలని, ప్రకృతి పట్ల వినయంగా, గౌరవంగా, దాసులుగా ఉండేందుకు అభ్యాసం చేయాలన్నారు.


logo