బుధవారం 08 జూలై 2020
National - Apr 13, 2020 , 15:15:37

చెన్నైలో ఇథియోపియా వాసుల అరెస్టు

చెన్నైలో ఇథియోపియా వాసుల అరెస్టు

విదేశీవ్యక్తుల నియంత్రణ చట్టం 1949 నియమాలను ఉల్లంఘించినందుకు చెన్నైలో 8 మంది ఇథియోపియావాసులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మన్నాడీలోని మసీదులో వీరు అనుమతి లేకుండా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ వ్యాధి నిర్థారణ కాలేదని వెల్లడించారు. అక్రమంగా నివాసం ఉంటున్నందుకు వారిని కోర్టు ఆదేశాలతో పుజల్ సెంట్రల్ జైలుకు తరలించారుమెడికల్ వీసాలతో దేశంలోకి ప్రవేశించిన వీరు, అనుమతి లేకుండా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని పోలీసులు తెలిపారు.


logo