సోమవారం 06 జూలై 2020
National - Apr 12, 2020 , 21:58:00

వీడియో కాల్ ద్వారా ఉచితంగా వైద్య సలహాలు

వీడియో కాల్ ద్వారా ఉచితంగా వైద్య సలహాలు


బ్లడ్ ప్రెజర్, షుగర్ , జ్వరంతోపాటు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఆన్ లైన్ లో ఉచితంగా వైద్య సలహాలూ ,సూచనలూ అందిస్తున్నారు బేగం పేటలోని కేర్ ప్లస్ పోలీక్లినిక్ అండ్ డయాగ్నస్టిక్స్ కు చెందిన డాక్టర్ త్రివిక్రమ్ . లాక్ డౌన్ ప్రకటించక ముందు నుంచే ఆయన ఉచితంగా ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య సలహాలు అందిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్  బుక్ ,వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కోవిడ్ -19 నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాట్సాప్ వీడియో కాల్స్ తో పేషంట్లకు ఏమేమి సమస్యలున్నాయో తెలుసుకొని వాటికి సరైన పరిష్కారాలు అందిస్తున్నారు విక్రమ్ . రోజుకు 60కిపైగా ఫోన్ కాల్స్, , 20 వీడియో కాల్స్ కు ఆన్ లైన్ లో ఉచితంగా వైద్య సలహాలూ , సూచనలూ అందిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇస్తూ జనాల్లో కరోనా మహమ్మారి పై  ఉన్న భయాందోళనలను తొలగిస్తున్నారు.  వైద్యుడిగా నే కాకుండా తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గానూ త్రివిక్రమ్ సేవలందిస్తున్నారు. ఉచితంగా వైద్య సలహాలు పొందాలనుకునేవారు 9440761161ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
-  ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉచితంగా వైద్య సలహాలు అందించడం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. వైద్య సలహాల కోసం తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. - డా. త్రివిక్రమ్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్,తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. 


logo