గురువారం 04 జూన్ 2020
National - Apr 11, 2020 , 00:14:15

ఆన్‌లైన్ లో నీట్, జీఈఈ కోచింగ్

ఆన్‌లైన్ లో నీట్, జీఈఈ కోచింగ్

 
 హైదరాబాద్ : కోట కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ మెడికల్, ఐఐటీ ప్రవేశ పరీక్షల కోచింగ్ ఇనిస్టిట్యూట్ కెరీర్ పాయింట్, ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండడంతో ఏప్రిల్ 15 నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) , జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) అభ్యర్థులకు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కెరీర్ పాయింట్ కు చెందిన అత్యుత్తమ ఫ్యాకల్టీ  ద్వారా లైవ్‌లో తరగతులు  నిర్వహించనున్నారు. దేశంలో ఏ ప్రాంత వాసులైనా తమ ఇంటి నుంచి సౌకర్యవంతంగా శిక్షణ పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటరాక్టివ్ లైవ్ చాటింగ్ ఫీచర్ కారణంగా విద్యార్థులు నేరుగా ప్రొఫెసర్‌తో సంభాషించడంతో పాటుగా తమ సందేహాలను తక్షణమే తీర్చుకోవచ్చు. వీటితో పాటు వేలాది వీడియో లెక్చర్స్, మాక్ టెస్ట్‌లు, రిజల్ట్ ఎనాలిసిస్ వంటివి ఒకే ప్యాకేజీలో అందిస్తారు. ఈ ఆన్‌లైన్ కోర్సులలో ప్రతి రోజూ ప్రత్యక్ష తరగతులు ఉంటాయి. ఈ ఆన్‌లైన్ తరగతులు లాక్‌డౌన్ ముగిసే వరకూ కొనసాగుతాయి. అనంతరం  సంబంధిత స్టడీ సెంటర్‌లలో క్లాస్‌రూమ్ తరగతులు ప్రారంభమవుతాయి.


logo