గురువారం 04 జూన్ 2020
National - Apr 10, 2020 , 23:25:48

వారి జీతాలు రెట్టింపు

వారి జీతాలు  రెట్టింపు


 కరోనా మహమ్మారిపై  పోరులో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. కరోనా సేవల్లో నిమగ్నమై ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది, లాబ్ టెక్నీషియన్లు, నాలుగవ తరగతి ఉద్యోగులకు జీతాలను రెట్టింపు చేసింది. ఈ మేరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఈ రోజొక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని వైద్యులు, మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఆయుర్వేద విభాగాల అధికారులతో   వీడియో కాన్ఫరెన్స్‌ లో సీఎం మాట్లాడారు. అనంతరం వైద్య సిబ్బంది జీతాలు రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.


logo