గురువారం 04 జూన్ 2020
National - Apr 10, 2020 , 22:54:30

పన్ను చెల్లింపుదారులకు ఊరట

 పన్ను చెల్లింపుదారులకు ఊరట కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న ఆర్థిక  సమస్యలను పరిష్కరించాలని  కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్‌కు నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకష్ణదేవరాయలు గతవారం లేఖ రాశారు. లాక్‌డౌన్‌ వల్ల నష్టపోతున్న చిన్న, మధ్య తరహ పరిశ్రమలను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని, కేంద్రం విడుదల చేయాల్సిన  అన్ని నిధులను విడుదల చేయాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం. మనదేశంలో 18లక్షల మంది పన్ను చెల్లింపుదారులు లాభపడేలా రూ. 5లక్షల లోపు చెల్లించాల్సిన ఇన్‌కామ్‌ టాక్స్‌ రీఫండ్స్‌ను విడుదల చేస్తున్నట్లు  ప్రకటించింది. అలాగే జీఎస్టీ, కస్టమ్‌ టాక్స్‌ రీఫండ్‌ను విడుదలచేసి ఈ పరిశ్రమలకు ఊరట కల్పించనుంది. మొత్తం రూ.18వేల కోట్ల రీఫండ్స్‌ను విడుదల చేసేందుకు కేంద్రం ఉత్తర్వులిచ్చింది. అలాగే ఈఎమ్‌లను ప్రజలు కట్టనవసరం లేదని, వడ్డీలను వసూలు చేస్తే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ శ్రీకష్ణదేవరాయలు కేంద్రప్రభుత్వానికి  శుక్రవారం ఓ ప్రకటన ద్వారా ధన్యవాదాలు తెలిపారు.


logo