సోమవారం 13 జూలై 2020
National - Apr 10, 2020 , 19:10:45

14 రోజుల తర్వాత సొంత ఇండ్లకు చేరుకున్నఆంధ్రా వాసులు

14 రోజుల తర్వాత సొంత ఇండ్లకు చేరుకున్నఆంధ్రా వాసులు


ఏపీ లోని  పలు జిల్లాలకు చెందిన 49 మంది 14 రోజుల క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వారిని నూజివీడు త్రిబుల్ ఐటీ కాలేజీ లో క్వారంటైన్ సెంటర్ కు తరలిం చారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటినుండి వారికి అవసరమైన చికిత్సలు నిర్వహించారు. తూర్పుగోదావరి-12, పశ్చిమ గోదావరి -25,గుంటూరు-3, ప్రకాశం-1, కృష్ణా -8 జిల్లాలకు చెందిన 49 మంది  ఉండగా . వీరిలో పిల్లలు, పెద్దలు ఉన్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ రాకపోవడంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఈరోజు  తమ  వాహనాల ద్వారా  తమ ఇండ్లను తరలించారు.  


logo