శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 18:28:24

పల్లెల్లో సడలింపు.. పట్టణాల్లో బిగింపు

పల్లెల్లో సడలింపు.. పట్టణాల్లో బిగింపు

కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో 21రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగుస్తుంది. తెలంగాణలో 15తో ముగుస్తుంది. వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే ఇదే సమయంలో పొలాల్లో పంటలు కోతకు రావటంతో ఈ నెల 14 తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొంటారు అనేదానిపై అంతటా ఆసక్తి నెలకొంది.

కేంద్ర ప్రభుత్వవర్గాలు శుక్రవారం తెలిపిన అభిప్రాయం ప్రకారం 14వ తేదీ తర్వాత పల్లెల్లో పంటకోతల కోసం లాక్‌డౌన్‌ను పరిమితంగా సడలించే అవకాశం ఉంది. పట్టణాల్లో మాత్రం మరింత కట్టుదిట్టంగా అమలుచేసే అవకాశం ఉంది. పంటల నూర్పిడి, ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే విషయంలో ఇప్పుడు ఉన్న మినహాయింపులను మరికొంత సడలించే అవకాశం ఉందని కేంద్రప్రభుత్వ వర్గాల సమాచారం. లేదంటే పంటలు నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే ఆహార భద్రతే ప్రమాదంలో పడుతుంది. సప్లై చైన్‌ దెబ్బతింటుంది. అంతేకాకుండా కరోనా వ్యాధి పట్టణాలు,నగరాల్లోనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కాస్త సడలించే అవకాశం ఉందని తెలుస్తున్నది.  


logo