సోమవారం 06 జూలై 2020
National - Apr 10, 2020 , 00:22:48

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కోరుతూ పిటిషన్

  పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కోరుతూ పిటిషన్ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దిల్లీ సఫాయి కర్మచారీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ హర్మన్ సింగ్ ఈ పిటిషన్‌ వేశారు. 24 గంటల్లో పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ సామగ్రి అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. అలాగే 48 గంటల్లో కార్మికులతోసహా కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో పీపీఈ కిట్లు వాడేలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) మార్గదర్శకాలు ఇచ్చిందని హర్మన్‌ సింగ్‌ పిటిషన్‌లో ప్రస్తావించారు.


logo